వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై లగచర్లలో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని అరెస్ట్ చేశారు. దీంతో పైలట్ రోహిత్ రెడ్డి తాజాగా మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి జైలుకెళ్లడం వెనుక మహేందర్ రెడ్డి కుట్ర ఉందన్నారు. బీఆర్ఎస్ ని వదిలి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లినప్పుడు తమ్ముడు నరేందర్ రెడ్డిని కూడా రమ్మంటే.. తాను రానని నరేందర్ రెడ్డి చెప్పినందుకే మహేంధర్ కుట్ర పన్ని ఆయనను జైలుకు పంపించారని తెలిపారు.
నరేందర్ రెడ్డి జైలుకు పోవడంలో ముఖ్యమైన కుట్ర పోషించింది పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ని, నన్ను నమ్ముకున్న కార్యకర్తలను వదిలి నేను కాంగ్రెస్ పార్టీలోకి రానని చెప్పారు. జైలుకు పంపించడంలో నరేందర్ రెడ్డి చేయి ఉందన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. సొంత సోదరుడికి అండగా నిలబడలేవా..? 90 ఏళ్ల మీ తల్లి ఆవేదన కనిపించలేదా..? నరేందర్ రెడ్డి భార్య, పిల్లల ఆవేదన కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.