బర్త్ డే స్పెషల్.. రామ్ చరణ్ బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?

-

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చేసే ప్రతి చిత్రంతో తన టాలెంట్ను నిరూపించుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. తనకంటూ సొంత ఫ్యాన్డమ్ క్రియేట్ చేసుకున్నాడు. ధృవ, రంగస్థలం, ఆరెంజ్, ఆర్ఆర్ఆర్ వంటి డిఫరెంట్ జానర్ సినిమాల్లో నటించి తన క్యాలిబర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక తాజాగా గేమ్ ఛేంజర్తో పాటు మరో రెండు కొత్త సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇవాళ (మార్చి 27) రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ బాల్యంలోని కొన్ని స్పెషల్ మూమెంట్స్ గురించి తెలుసుకుందామా?

‘చిరంజీవి కుమారుడే కదా షూటింగ్స్ వెళ్లడం కామన్ అనుకుంటారు. కానీ చెర్రీ మెగాస్టార్ నటించిన ‘రాజా విక్రమార్క’, ‘లంకేశ్వరుడు’, ‘ఆపద్భాంధవుడు’ సెట్స్‌కు మాత్రమే వెళ్లాడట.

ఓసారి చరణ్ సినీ మ్యాగజైన్‌ చదవాలనే దాన్ని ఓపెన్‌ చేయగా.. చిరంజీవి హఠాత్తుగా వచ్చాడట. ఇక ఆ రోజు ఇంట్లో పెద్ద రచ్చ జరిగిందట. పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్‌’ ఇచ్చారు చిరు.

చదువులో చరణ్ యావరేజ్‌. 8 స్కూల్స్‌, 3 కాలేజీలు మారాడు.

చరణ్ నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. హార్స్‌ రైడింగ్‌లో ఆయన టాలెంట్ ‘మగధీర’ చూస్తే అర్థమైపోతుంది.

పెంపుడు జంతువులను ఇష్టపడే చెర్రీ.. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు.

చరణ్ తరచూ ఏదో ఒక మాలధారణలో కనిపిస్తుంటారు. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటాడట.

కథకు, పాత్రకు తగిన న్యాయం చేశావంటూ ‘ధృవ’ విషయంలో చరణ్ను చిరు మెచ్చుకున్నారు. ‘రంగస్థలం’ సినిమా చూస్తూ తన తల్లి సురేఖ ఎమోషనల్ అయి మూవీ పూర్తయ్యాక తనను పక్కన కూర్చోమని అడిగిందట. ఈ రెండూ నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు’’ అని చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version