తమిళ స్టార్ హీరో శింబు కారు ప్రమాదానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం నాడు రాత్రి 7 గంటల సమయంలో ఎలాంగో సలై-పోస్ రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది.చనిపోయిన వృద్దుడు మునుస్వామిగా గుర్తించారు పోలీసులు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే పోలీసులు కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో హీరో శింబు తండ్రి డైరెక్టర్, నటుడు రాజేందర్ కూడా ఉన్నారట.
ఆయన ప్రమాదం జరిగిన వెంటనే వృద్ధుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించడానికి ఆంబులెన్స్ నీ కుడా పిలిపించారు. అయితే అంబులెన్స్ ప్రమాద స్థలానికి చేరుకొనే లోపు ఆ వృద్దుడు మునుస్వామి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. చనిపోయిన వృద్దుడు వికలాంగుడని అతను రోడ్డుమీద పాక్కుంటూ వెళ్ళేది డ్రైవర్ కి కనపడకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిఉండవచ్చని సమాచారం. పాండి బజార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు మొదట్లో ఐపీసి సెక్షన్ 337 (ఎదైనా ఆవేశంగా మరియు నిర్లక్షంగా చేయడం ద్వారా ఒక వ్యక్తి కి హాని కలిగించడం) 279 అనగా (డ్రైవింగ్ లేదా భహిరంగ మార్గం లో రైడింగ్)కింద శిక్ష నేరమైన కేసులు నమోదు చేశారు. తరువాత వారు ఐ పి సి 304 (A) నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల సంభవించిన మరణం గా కేసును మార్చారు. డ్రైవర్ సెల్వం ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. సమీపంలో గల కొన్ని నివాసాలు దుకాణాలలో ఉన్న సీసీ టీవీ కెమెరాల నుండి సేకరించిన వీడియోల ఆధారంగా తనిఖీ చేశారు.