త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా.. ఆ పార్టీకి మద్దతిస్తా : నటుడు సుమన్

-

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయమేం కాదు. రాజకీయాల్లోకి రావడమే కాదు కొత్త పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళ్లిన నాయకులు ఎందరో. అలా కొందరు రాజకీయాల్లో సూపర్ హిట్ అయితే.. మరికొందరు మాత్రం పాస్ మార్కులతో పాస్ అయిన వారున్నారు. ఇంకొందరు ఈ రాజకీయాలు మనకు పడవురా బాబు అనుకుని తట్టా బుట్టా సర్దుకుని మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసిన వాళ్లున్నారు. అయితే తాజాగా మరో నటుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఆయన ఎవరంటే..?

తాను తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని సినీ నటుడు సుమన్‌ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో భారాసకే తన మద్దతని చెప్పారు. వర్షాలు, విపత్తులు ఏటా ఉండేవే అని ఆ దిశగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని రైతులు కోరేది కొంచమేనని ఏ ప్రభుత్వమైనా వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version