సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు భోజనం చేశారు.అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళ హారతితో మహిళలు స్వాగతం పలికారు. అయితే, తనకు భోజనం పెట్టిన మహిళకు సీఎం రేవంత్ చీర పెట్టినట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ భద్రాచలం శ్రీసీతారాముల ఆలయానికి వెళ్లి అక్కడ స్వామి వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంరతం వేదపండితులు రేవంత్ దంపతులకు స్వామివారి తలంబ్రాలను అందజేశారు.
సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం
కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళ హారతితో స్వాగతం
పలికిన మహిళలు pic.twitter.com/tON4VweuMh— BIG TV Breaking News (@bigtvtelugu) April 6, 2025