నరేష్‌తో పవిత్ర అగ్రిమెంట్.. విడిపోతే అన్ని కోట్లు ఇవ్వాలా?? అదిరే ట్విస్ట్ రా సామి.. !!

-

పవిత్రా లోకేష్‌ను నరేష్ నాలుగో పెళ్లి చేసుకుబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి తెరపైకి వచ్చి.. నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి సిద్ధమవుతున్నాడని ఆరోపణలు చేశారు. నరేష్ కూడా ఘాటుగానే స్పందిస్తూ.. డబ్బు కోసమే రమ్య తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా త‌న ద‌గ్గర ప‌నిచేసే డ్రైవ‌ర్‌తో ఎఫైర్ పెట్టుకుంద‌ని.. విష‌యం తెలిసి ప్రశ్నిస్తే చెత్త వివ‌ర‌ణ‌లు ఇచ్చింద‌ని ఆయ‌న బాధ‌ను వ్యక్తం చేశారు. ఆ తరువాత పవిత్రా లోకేష్ కూడా స్పందిస్తూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవలె నరేష్, పవిత్రా లోకేష్ ఓ హోటల్‌లో ఉండగా.. రమ్యా రఘుపతి విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. పవిత్రను చూసి కోపంతో చెప్పు తీసుకుని దాడికి యత్నించారు. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. రమ్య, ఆమె కుటుంబ సభ్యులను చూసుకుంటూ నరేష్ విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి పవిత్రా లోకేష్‌తో కలిసి వెళ్లిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అయితే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.

తమ రిలేషన్ విషయంలో నరేష్, పవిత్ర ఓ అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ అగ్రిమెంట్ ప్రకారం తనతో రిలేషన్ లో ఉన్నందుకు గాను నెలకి రూ 25 లక్షలు ఇవ్వాలని పవిత్ర ఒప్పందం చేసుకుందట. ఒక వేల భవిష్యత్తులో విడిపోయి మరొకరితో రిలేషన్ పెట్టుకుంటే తనకి 50 కోట్లు చెల్లించేలా పవిత్ర అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు గాసిప్ వైరల్ గా మారింది.

ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తేలాల్సి ఉంది. గతంలో వీరిద్దరూ వివాహం చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వీరికి ఆ ఉద్దేశం లేదట. నరేష్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నారు. ఇకపై పెళ్లిళ్లు వద్దని.. రిలేషన్ షిప్ లో మాత్రమే ఉంటే ఎలాంటి ఫ్యామిలీ సమస్యలు రావని భావిస్తున్నారట.

కేవలం రిలేషన్ షిప్ కి మాత్రమే పవిత్ర కూడా అంగీకరించింది కానీ.. ఇలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి ఎఫైర్ మ్యాటర్ లో ఇది పెద్ద టిస్ట్ అని నెటిజన్లు అంటున్నారు. నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో బిజీగా గడుపుతున్నారు. యువ హీరోలకు తండ్రి పాత్రల్లో ఎక్కువగా నరేషే కనిపిస్తున్నారు. అలాగే పవిత్ర కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version