రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం తీవ్రదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. 400 ఎకరాల విస్తీర్ణంపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇతరుల సంచారంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రశాంతతకు భంగం కలిగేలా ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు. విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకుంటే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
కంచ గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమి విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టుకు చేరింది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో ఈ కేసులు పెండిగులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆంక్షలు విధించాం. మా విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలుంటాయి. ఈ వైపునకు దురుద్దేశంతో వచ్చే వ్యక్తుల ప్రవేశం పైనా నిషేధం విధించాం. ఆంక్షలను అందరూ విధిగా పాటించాలి. అని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.