బర్త్ డే స్పెషల్.. జాన్వీ కపూర్‌ పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ తెలుసా?

-

శ్రీదేవి కుమార్తెగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కొంత కాలంలోనే తన సత్తా చాటింది. వర్సటైల్ సినిమాలు చేస్తూ స్టార్డమ్ సొంతం చేసుకుంది. బీ టౌన్లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. జాన్వీ ఫొటోలు పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావాల్సిందే. నేడు జాన్వీ పుట్టిన రోజు. సోషల్ మీడియాలో ఈ భామకు బర్త్ డే విషెస్ హోరెత్తుతున్నాయి. అయితే నెట్టింట ఈ భామకు సంబంధించి ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీకి జాన్వీ పేరు ఎలా వచ్చిందో అనే విషయంపై సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండ్ అవుతోంది.

జాన్వీకి ఈ పేరు పెట్టడం వెనుక ఓ క్యూట్‌ స్టోరీ ఉందట. 1997లో శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ కలిసి ‘జుదాయి’ అనే సినిమాలో నటించారు. దీన్ని బోనీ కపూర్‌ నిర్మించారు. ఆ సినిమాలో ఊర్మిళ మతోంద్కర్‌ కీలక పాత్ర పోషించారు. ఆ పాత్ర పేరు జాన్వీ. ఈ పేరంటే శ్రీదేవి, బోనీకి చాలా ఇష్టమట. వారి మొదటి బిడ్డకు ఈ పేరు పెట్టాలని ఆ సినిమా సమయంలోనే నిర్ణయించుకున్నారట. అలా కుదిరిన పేరే జాన్వీ కపూర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version