JC ప్రభాకర్ రెడ్డి పై MAA కి ఫిర్యాదు చేసిన నటి మాధవీలత

-

JC ప్రభాకర్ రెడ్డి పై MAA కి ఫిర్యాదు చేశారు నటి మాధవీలత. సినిమాలో నటిస్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. MAA ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందజేశారు మాధవీలత. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ.. మానవ హక్కుల సంఘానికి, పోలీస్ లకు ఫిర్యాదు చేశానని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారని వివరించారు.

Actress Madhavilatha complained to MAA against JC Prabhakar Reddy

నా మీద వచ్చిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ కండించలేదు అందుకే మాకు ఫిర్యాదు చేశానని… మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారని పేర్కొన్నారు. నా ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారని… నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతానన్నారు. సినిమా వాళ్ళను అందరూ అవమానిస్తారు.. కానీ రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నామని… వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఫైర్‌ అయ్యారు నటి మాధవీలత.

Read more RELATED
Recommended to you

Exit mobile version