ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఆది పురుష్ .. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఊహించిన విధంగా వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
అయితే, ఆది పురుష్ డైలాగ్స్ పై తీవ్ర విమర్శల నేపథ్యంలో మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మూవీలోని కొన్ని డైలాగ్స్ పై నేను ఎన్ని వివరణలు ఇచ్చినా అవి మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతున్నాయి. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన డైలాగ్స్ తీసేయాలని డిసైడ్ అయ్యాం. వాటి స్థానంలో కొత్త డైలాగ్స్ యాడ్ చేస్తున్నాం. వచ్చేవారం నుంచి ఇవి సినిమాలో అందుబాటులోకి వస్తాయి’ అని ఆది పురుష్ రచయిత మనోజ్ ముంత్ శిర్ ట్వీట్ చేశారు.