అర్హతో అల్లు అర్జున్ క్యూట్ వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్స్

-

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ పెరిగిపోయింది. అంతకుముందు వరకు సౌత్ లోనే బన్నీకి క్రేజ్ ఉండేది.. పుష్ప తర్వాత పాన్ ఇండియాలో లెవెల్ లో బన్నీకి పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ పుష్ప2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా బన్నీ తన ఫ్యామిలీకి టైం కేటాయించడం మాత్రం మరిచిపోడు. ఆ క్వాలిటీయే ఈ స్టైలిష్ స్టార్ ను ఫ్యామిలీ మ్యాన్ ను చేసింది.

ఇక అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బన్నీ-అర్హల కాంబోకు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి చేసే వీడియోలకు ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే ఈ క్యూట్ పెయిర్ కలిసి ఫన్నీ వీడియోలు చేసి అభిమానులను అలరించారు. తాజాగా అల్లు అర్జున్ అర్హతో కలిసి కారులో వెళ్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో అర్హ బన్నీ ఒడిలో కూర్చుని ఉంది. తన చేతులతో ముఖాన్ని కనిపించకుండా చేసింది. దాంతో అల్లు అర్జున్ తన చేతులను తీయడానికి ప్రయత్నించగా అర్హ ప్రతిఘటించింది. ఇలా కాసేపు ఇద్దరూ అల్లరి చేశారు. ఈ వీడియోను బన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఇంకేం.. అభిమానులు ఈ తండ్రీకూతుళ్ల అల్లరిని చూసి ముచ్చట పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version