పుష్పలో అల్లు అర్జున్ ఊతపదం అదే..

-

అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమాగా పుష్ప రెడీ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు మరో రేంజిలో ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఊర మాస్ క్యారెక్టర్ లో బన్నీ పాత్ర కొత్తగా ఉంటుందని, స్టైలిష్ స్టార్ గా పేరున్న నటుడు మ మ మాస్ గా కనిపిస్తున్నాడని అర్థమైంది. తాజాగా ఈ సినిమా నుండి ఓ కీలక విషయం బయటకి వచ్చింది.

చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తగ్గేదే లే అన్న బన్నీ అభిమానులకి ఓ హింట్ ఇచ్చాడు. అవును, తగ్గేదే లే అన్న పదం అప్పటి నుండి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ పదం పుష్ప సినిమాలో బన్నీ ఊతపదంగా ఉండనుందట. రంగస్థలంలో రామ్ చరణ్ కంటే మాస్ గా కనిపిస్తున్న బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. చిత్తూరు ప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథ ఎర్ర చందనం కలప స్మగ్లింగ్ అంశంగా ఉండనుంది. ఇందులో బన్నీ మాట్లాడే యాస, మాటలు కొత్తగా ఉండనున్నాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version