వరసగా స్టార్ హీరోల సినిమాల్లో చేస్తున్న…. ఈ చిన్ననాటి ఫోటోలో ఉన్న స్టార్ యాంకర్ ఎవరో తెలుసా..?

-

రంగ‌మ్మ‌త్త ఎక్క‌డుంది
ద్రాక్షాయ‌ణి ఏం చేస్తుంది
అందం మాట్లాడితే ఆమె
అభిన‌యంతో అల‌రిస్తే ఆమె
వెర‌సి అన‌సూయ
క్లుప్తంగా నాల్గ‌క్ష‌రాల ఒదిగిన సంచ‌ల‌నం కూడా !

యాంకర్ గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై కూడా విభిన్నమైన పాత్రలు పోషిస్తోంది అనసూయ.జబర్ద‌స్త్ భామగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.తన అందం,అభినయంతో ఇటు టీవీల్లో యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు.తాజాగా ఈ అమ్మడు చిన్ననాటి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఓ వైపు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వెండితెరపై రాణిస్తున్నారు.

ప్రస్తుతం అనసూయ వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.గతంలో రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో ఎంతో పేరు సంపాదించారు.తాజాగా సుకుమార్ ‘ పుష్ప‌’ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న ద్రాక్షాయణి పాత్రలో జీవించారు.మొదటి భాగం లో పెద్దగా స్కోప్ లేకున్నా.. రెండో భాగంలో మాత్రం అనసూయ క్యారెక్టర్ కు చాాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.వీటీతో పాటు చిరంజీవి సినిమాలు ‘ గాడ్ ఫాదర్’, ‘ ఆచార్య’ సినిమాల్లో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారీమె.

సంపత్ నంది డైరెక్షన్ లో కూడా ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘ రంగ మార్తాండ’ సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నారు. మరాఠీ సినిమా ‘ నటసామ్రాట్ ’కు రీమేక్ గా రూపొందుతున్న ఓ సినిమాలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ దేవదాసీ రోల్… దేవాలయానికి అంకితమయి, పెళ్లి చేసుకోకుండా ఉండే ఓ పాత్రలో కనిపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version