రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, గ్రామసభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు.దీంతో గ్రామస్తులు నిలదీస్తున్నారని అధికారులు గ్రామసభల నుంచి వెళ్లిపోతున్నారు.
ఈ క్రమంలోనే గ్రామసభల్లోని అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా..కొందరు ఆ సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.దీంతో భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వారిని బెదిరిస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్రామ సభల్లో వ్యతిరేకత.. వీడియోలు పెడుతున్న వారిని బెదిరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
సోషల్ మీడియాలో ఏకంగా బెదిరింపులకు దిగుతున్న భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ pic.twitter.com/Rx7sT90IXU
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2025