రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు వున్నారు. మీనాక్షీ దీక్షిత్, డింపుల్ హయాతీ. ముచ్చటగా మూడవ హీరోయిన్గా అనసూయని ఫైనల్ చేసినట్టు తెలిసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కతున్న ఈ మూవీకి మరింత గ్లామర్‌ని అద్దాలన్న ప్రయత్నంలో భాగంగా అనసూయని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట.
ఇందులో అనసూయ పాత్ర పేరు `చంద్రశేఖ`. అగ్రహారంలో వుండే టిపికల్ బ్రహ్మణ యువతిగా ఆమె పాత్ర వుంటుందని తెలిసింది. ప్రసత్తుం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలో అనసూయ ఈ మూవీ సెట్లోకి ఎంటర్ కానుందట. అనసూయ ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న `రంగమార్తాండ`, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రాల్లో నటిస్తోంది.