నటి అనుపమ పరమేశ్వరం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ చిన్నది తెలుగు తమిళ్ మలయాళం లో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తనదైన నటన అన్న చెందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతారు ఇదిలా ఉండగా అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం పరదా. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం శరవేగంగా కొనసాగిస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో అనుపమ మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. కొన్ని సమయాలలో తాము ఓకే చేసిన స్క్రిప్ట్ సినిమా పూర్తయ్యేలోపు పూర్తిగా మారిపోతుందని అనుపమన్నారు కేవలం కథ మాత్రమే కాదు పాత్రల విషయంలోనూ ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి అవన్నీ తెలియక ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేశావని ప్రశ్నిస్తూ ఉంటారు అంటూ అనుపమన్నారు దీంతో అనుపమ పరమేశ్వరన్ జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ సినిమా గురించే అనుపమ ఇలా మాట్లాడారని కొంతమంది కామెంట్లో చేస్తున్నారు ప్రస్తుతం అనుపమ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.