2009లో వచ్చిన అవతార్ సినిమా సీక్వెల్ గా ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం అవతార 2.. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 180 పైగా భాషల్లో ఘనంగా విడుదలయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రారంభంలో ఓపెనింగ్ పరంగా నిరాశపరిచినప్పటికీ.. ఫుల్ రన్ లో మాత్రం స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికన్, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. ముఖ్యంగా 10 రోజులకు కలిపి ఈ సినిమా ఒక బిలియన్ మార్క్ కి దగ్గరగా వచ్చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 8000 కోట్ల రూపాయలు అన్నమాట.
ఇకపోతే నిన్న ఒక్కరోజే ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం.. నిన్న ఆదివారం పైగా క్రిస్మస్ హాలిడే కావడంతో చాలా మంది తమ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను థియేటర్లలో వీక్షించారు అని నివేదిక వెల్లడించింది.. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో వచ్చిన వసూళ్ళ ను పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ 3D, 4DX, ఐమాక్స్ స్క్రీన్స్ ఉండడం వల్లే అంత భారీ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే అక్కడ 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్లో రూ. 22 కోట్లు, సీడెడ్ లో రూ. 7 కోట్ల 20 లక్షల రూపాయల వసూలు కలెక్ట్ చేసింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 64 కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చినట్లు సమాచారం.నార్త్ ఇండియాలో రూ.140 కోట్లు .. తమిళనాడులో రూ. 40 కోట్లు.. కర్ణాటకలో రూ.39 కోట్లు.. కేరళలో రూ. 29 కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం. మొత్తం మీద ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయినట్టు సమాచారం.