చాణక్య నీతి: సంతోషంగా ఉండాలంటే ఇలాంటి మిత్రులకు దూరంగా ఉండాలి.. లేదంటే ఎప్పుడూ బాధలే..!

-

చాణక్య ఎన్నో విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం చాలా బాగుంటుంది. స్నేహితుల గురించి వైవాహిక జీవితం గురించి జీవితంలో సక్సెస్ అవ్వడం గురించి చాణక్య ఎన్నో చెప్పారు. అయితే ఇలాంటి స్నేహితులతో స్నేహం చేయడం వలన ఇబ్బందులు వస్తాయని చాణక్య అన్నారు. మరి ఎలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే విలువలకు కట్టుబడి ఉండరో అలాంటి వాళ్లతో స్నేహం చేయకూడదని అన్నారు. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి అని చెప్పారు. అలాగే చాణక్య ఎవరైతే మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా మనల్ని బాధ కలిగిస్తారో ఎగతాళి చేస్తారో అలాంటి వాళ్లకు కూడా దూరంగా ఉండాలని.. వాళ్ళ వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాలని మనకి కూడా ఎలాంటి విలువ ఉండదని చాణక్య అన్నారు.

కాబట్టి అలాంటి వాళ్ళతో కూడా దూరంగా ఉండాలి. కొంతమంది స్నేహితులు బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉండాలట. ఎవరైతే ఎప్పుడూ కూడా బెనిఫిట్ ని పొందడానికి మాత్రమే స్నేహం చేస్తారో అలాంటి వాళ్లను అస్సలు దగ్గరకు రానివ్వకూడదని కేవలం ప్రయోజనం కోసమే మన చుట్టూ తిరుగుతూ ఉంటారని చాణక్య అన్నారు. కొంతమంది స్నేహితులు ఎప్పుడూ కూడా చెడు అలవాట్లను ప్రోత్సహిస్తూ ఉంటారు.

అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని దూరంగా ఉంటేనే మంచిదని చాణక్య చెప్పారు. కొంతమంది మనుషులకి రెండు ముఖాలు ఉంటాయి. ముందు ఒక మాట వెనక ఒక మాట ఆడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అస్సలు దగ్గరగా ఉండకూడదు. కొంతమంది స్నేహితులు ఎప్పుడూ కూడా ఈర్ష్య కలిగి ఉంటారు అలాంటి వాళ్లకు కూడా దగ్గరగా ఉండడం మంచిది. వారితో స్నేహం చేయకపోవడమే మంచిది అన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version