Baby : ఈనెల 25న OTTలోకి ‘బేబీ’ మూవీ..ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ సినిమా మేనియానే. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాపై మీమ్స్ మామూలుగా లేవు. అటు మౌత్ టాక్.. ఇటు కలెక్షన్లతో బేబీకి మంచి హిట్ దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తోంది. డైరెక్టర్ సాయి రాజేష్ ఒక చిన్న కథను తీసుకుని చాలా సులభమైన విధానంలో “బేబీ” అనే సినిమాను ప్రేక్షకులకు అందించాడు.

సాయి రాజేష్ సమకూర్చిన పాత్రలలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి లు చక్కగా నటించి మెప్పించారు. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు శుభవార్త వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ‘బేబీ’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నెల 25వ తేదీల్లో స్ట్రీమింగ్‌ అవుతుందని ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version