పాపం.. బాల‌య్య‌కు హీరోయిన్లు దొర‌క‌డం లేదు.. అందుకే ఇలా..!

-

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రూలర్ సినిమా తర్వాత విరామం తీసుకున్న బాలయ్యా.. బోయపాటి సినిమా కోసం కసరత్తులు కూడా ప్రారంభించారు. సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లో వచ్చారు. ఈ సినిమా బరువు కూడా భారీగానే తగ్గిపోయారు. ఇక ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. బాలకృష్ణ పాత్రను బోయపాటి చాలా కొత్తగా డిజైన్ చేశారనీ, ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ముందుగా నయనతారను సంప్రదించారు.

డేట్స్ ఖాళీ లేవనే సమాధానం నయనతార నుంచి వచ్చిందట. దాంతో శ్రియను సంప్రదించారు. ఆమె అంతగా ఆసక్తిని చూపలేదట. ఇలా సీనియర్ హీరోయిన్స్ అందుబాటులో లేకపోవడం గురించి బాలకృష్ణతో బోయపాటి మాట్లాడటంతో అసహనానికి లోనైన బాలకృష్ణ, కొత్త వాళ్లను తీసుకోమని కాస్త గట్టిగానే చెప్పారట. సాధారణంగా కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంలో బాలకృష్ణ ఆలస్యాన్ని ఎంతమాత్రం సహించరు. అలాంటి ఆయన హీరోయిన్స్ విషయంలో వెతుకులాట కారణంగా షూటింగుకి వెళ్లడం లేట్ కావడాన్ని అసలే ఇష్టపడరు. అందువల్లనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకుని వుంటారని చెప్పుకుంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version