తమ నటనతో మంచి పేరు సంపాదించుకొని స్టార్ స్టేటస్ అందుకున్న పలువురు నటీమణులు ప్రస్తుతం బిజినెస్ లో సైతం దూసుకుపోతున్నారు. ఇప్పటికే బిజినెస్ రంగంలో అడుగుపెట్టి తమదైన ముద్ర వేశారు. అయితే ఆ ముద్దుగుమ్మలు ఎవరు ఒకసారి తెలుసుకుందాం.
బ్యూటీ విత్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ తో మన హీరోయిన్స్ నటనతో పాటు బిజినెస్ సైతం తమదైన ముద్ర వేశారు అందులో ముఖ్యంగా..
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే ‘సాకి’ అనే పేరుతో ఓ ఫ్యాషన్ దుస్తుల వ్యాపారాన్ని చేస్తున్నారు. అలాగే గతేడాది ‘సస్టైన్ కార్ట్’ అనే ఆన్లైన్ స్టోర్‌తో పాటు తాజాగా ‘నరిష్ యూ’ అనే కంపెనీలో సమంత పెట్టుబడులు పెట్టారు.
టాలీవుడ్ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లోకి వచ్చిన దగ్గరనుంచి వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు. అలా పోషకాలతో కూడిన ఆహారం అందించే ‘వెల్బీయింగ్ న్యూట్రిషన్’ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టారు.
చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్.. టీఎసీ (ది ఆయుర్వేద)’ కంపెనీలో పపెట్టుబడులు పెడుతూనే తన సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి ‘మర్సలా’ అనే పేరుతో ఓ జ్యువెలరీ స్టోర్ నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పటికే ‘ఎఫ్ 45’ జిమ్‌లో పెట్టుబడి పెట్టి హైదరాబాద్ ఫ్రాంచైజీని నిర్వహిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన.. బ్యూటీకేర్ ప్రాడక్ట్స్ తయారు చేసే ‘ప్లమ్’ అనే సంస్థలో కన్నడ బ్యూటీ రష్మిక పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ సంస్థకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
కన్నడ నటి ప్రణీతకు బెంగళూరులో ‘బూట్లెగ్గర్’ పేరుతో ఓ రెస్టారెంట్ ఉంది. ఆతిథ్య రంగంలోని ఓ కంపెనీలో ఈమెకు భాగస్వామ్యం ఉంది. అలాగే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈమె అతనికి సంబంధించిన పలు వ్యాపారాల్లో సైతం చురుగ్గా ఉంటున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హసన్ ‘ఇసిడ్రో’ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించారు. దీని ద్వారా షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్, మల్టీ మీడియా కంటెంట్‌ను రూపొందిస్తున్నారు.
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ఇప్పటికే ‘వైట్ అండ్ గోల్డ్’ పేరుతో ఆన్లైన్లో ఓ ఆభరణాల స్టోర్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రముఖ కాస్మటిక్స్ సంస్థ ‘షుగర్’లో పెట్టుబడి పెట్టి భాగస్వామిగా మారారు.
హీరోయిన్ తాప్సీ పన్ను తస సోదరితో కలిసి ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు. అలాగే ప్రీమియర్ బ్యాట్మింటన్ లీగ్ పుణె ఫ్రాంచైజీలో పెట్టుబడులు కూడా పెట్టారు.
మహానటి కీర్తి సురేష్.. చెన్నైకి చెందిన డిజిటల్ హోమ్ కుక్కింగ్ స్టార్టప్ సంస్థలో కీర్తి సురేశ్ పెట్టుబడి పెట్టారు. ఇంకా స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే ‘భూమిత్ర’ అనే సంస్థలోనూ భాగస్వామిగా మరారు.
తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార ఫుడ్ కంపెనీ ‘ఛాయ్ వాలే’, కాస్మొటిక్ కంపెనీ ‘ది లిప్ బామ్’లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేశారు. ఇంకా రౌడీ పపిక్చర్స్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ ఇంధన తయారీ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.