హైదరాబాద్ స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ల స్వీకరణకు నిన్నటితో గడువు ముగియగా.. బీజేపీ నుంచి ఎన్.గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేశారు.ఇక ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ బరిలోకి దిగారు.
ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించగా.. తాము కూడా పోటీకి దూరంగా ఉంటున్నట్లు అధికార కాంగ్రెస్ ప్రకటన చేయడం చర్చకు దారితీసింది. ఇప్పటివరకు మొత్తం 4 నామినేషన్లు దాఖలవ్వగా.. అందులో 2 స్వతంత్ర అభ్యర్థులవి ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.