బెల్లంకొండ శ్రీనివాస్ మిని మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్..!

-

తమిళంలో ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం ‘గరుడన్’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

తాజాగా టైటిల్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గుడిముందు ఓ చేతిలో త్రిశూలం, ఓ చేతిలో కొడవలి పట్టుకొని కోపంగా చూస్తూ కూర్చున్నాడు. ఈ సినిమాతో శంకర్ కుమార్తె అదితి శంకర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవల ముగిసిన షెడ్యూల్ లో అదితి శంకర్ సీన్స్ కంప్లీట్ చేశారు.  దర్శకుడు. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ మినీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను డిసెంబర్ మూడో వారంలో విడుదల చేసే అలోచన కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version