తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అమ్మ సెంటిమెంట్‌తో విజయ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాడు. అందుకే దీనికి సీక్వెల్ తీయాలనుకున్నారు మేకర్స్. ఈ క్రమంలో సూపర్‌హిట్ చిత్రం ‘బిచ్చగాడు’కు కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ తెరకెక్కింది. (స్వీయ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్ మే 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చాలా పవర్ ఫుల్‌గా కనిపించింది. ట్రైలర్ చూస్తుంటే ఈసారి సినిమాలో విజయ్ చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ ఆంటోని టూ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపించినున్నట్లు సమాచారం. సూటు బూటు వేసుకుని సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఓ లుక్‌లో విజయ్ మెస్మరైజ్ చేస్తున్నాడు. మరోవైపు గడ్డం.. మాల వేసుకున్న రఫ్ లుక్‌లోనూ అలరించాడు. ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదుర్స్. పార్ట్-1లో అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన విజయ్.. పార్ట్-2లో ప్రేక్షకులను ఎలా అలరించనున్నాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.