“లైగర్” మూవీ నుండి బిగ్ అప్డేట్

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ” లైగర్” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.మైక్ టైసన్ ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తండ్రిగా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ పాన్ ఇండియా మూవీ ఆడియో రైట్స్ ని ప్రముఖ ఆడియో లేబుల్స్ లో ఒకటైన ‘సోనీ మ్యూజిక్’ 14 కోట్లకు సొంతం చేసుకుంది అని సమాచారం.” లైగర్ ” సినిమా ఆగస్టు 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version