బిగ్ బాస్: ఈ సారి సోహైల్ కి గట్టిగా పడింది.. పిచ్చికుక్కతో పోల్చుతూ..

-

బిగ్ బాస్ ప్రేక్షకులందరూ ఎవరి విషయంలో అయితే నాగార్జున సీరియస్ గా క్లాస్ తీసుకోవాలని అనుకున్నారో వాళ్ళందరికీ క్లాస్ పడింది. నామినేషన్స్ లో అభిజిత్, అఖిల్ మధ్య జరిగిన వాదనలో మోనాల్ ని ఎందుకు తీసుకొచ్చారని, ఇక ముందు అలా చేయకూడదని చెప్పి గట్టిగా వారించాడు. ఈ విషయమై అభిజిత్ తప్పు తనది కాదనే ప్రయత్నం చేసినా, నాగార్జున చాలా గట్టిగా చెప్పాడు తప్పు ఇద్దరిదని.

స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అవడానికి కారణం అమ్మ రాజశేఖరే అన్న నోయల్ కి, కుమార్ సాయి కి నువ్వు కూడా అలాగే చేసావు కదా మరి అప్పుడు అలా ఎందుకు ఆలోచించలేదని నోయల్ కి మాట రాకుండా చేసాడు. పుచ్చ పగలగొడ్తా అన్న మెహబూబ్ కి పుచ్చ పగిలిపోయేలా వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడూ అరుస్తూ కనిపించే సోహైల్ పై నాగార్జున తీవ్రంగా స్పందించాడు. పిచ్చి కుక్కతో పోల్చుతూ చెప్పాడంటే సోహైల్ ప్రవర్తన బిగ్ బాస్ యాజమాన్యానికి ఎంత చికాకు తెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.

తన వాదన మాత్రమే చెప్పి ఇతరులు ఏదైనా చెప్పడానికి వస్తే పట్టించుకోని అమ్మ రాజశేఖర్ కి తనదైన శైలిలో ఉదాహరణ చూపించిన వైనం బాగుంది. ఐతే ఈ రోజు ఎపిసోడ్ లో గంగవ్వ ఇంటికెళ్ళిపోయింది. నామినేషన్స్ లో లేకపోయినప్పటికీ, ఒకే గదిలో ఉండలేకపోతున్నానని చెప్పడంతో బిగ్ బాస్ టీమ్ ఆమెని పంపించేసింది. గంగవ్వ స్టేజి మీదకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడంలో మేమందరం సాయపడతాం అంటూ నాగార్జున మాటిచ్చాడు. మొత్తానికి అటు వార్నింగులతో ఇటు గంగవ్వని సాగనంపడంలో ఎపిసోడ్ మొత్తం ఆసక్తిగా సాగిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version