ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్.. దాయాదుల సమరం..?

-

గత నెల రోజులుగా ఛాంపియన్స్‌ ట్రోఫీ పై తర్జన భర్జన పడిన ఐసీసీ ఎట్టకేలకు టోర్నీ యొక్క షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే ఇప్పటికే ఇండియా ఆడే మ్యాచ్ లు అన్ని.. తటస్థ వేదికలపైనా జరుగుతాయి అని పేర్కొన ఐసీసీ.. దుబాయ్ ని ఖరారు చేసింది. గ్రూప్‌-ఏలో భారత్‌, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్ – న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.

ఇక ఇండియా తమ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 20న బాంగ్లాదేశ్ తో ఆడనుంది. అలాగే ఫిబ్రవరి 22న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇక మర్చి 2న చివరి లీగ్ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడుతుంది భారత్. అలాగే మొదటి సెమీస్ మార్చి 4న దుబాయ్ వేదికగా.. రెండోది పాకిస్థాన్ వేదికగా మార్చి 5న జరుగుతుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఉంటుంది. ఫైనల్ కు భారత్ చేరితే దుబాయ్ లో.. లేకపోతే పాక్ లో ఈ టైటిల్ పోరు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version