బిగ్ బాస్ 6 హౌస్ లోకి అడుగుపెట్టిన 21 మంది కంటెస్టెంట్లలో గీతూ రాయల్ కూడా ఒకరు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ స్ట్రాటజీలు ప్లే చేయడం ఎంత ఇంపార్టెంటో.. ఆ స్ట్రాటజీ చూసే జనానికి ఆమోదియోగ్యంగా ఉండకపోతే ఛీ కొడతారు. ప్రస్తుతం గీతూ రాయల్ పరిస్థితి ఇలాగే మారింది. ఇక ఎలా గెలిచాం అనే పాయింటును గాలికి వదిలేసి విమర్శల పాలవుతోంది . ఇక ఆమె బిహేవియర్ మాట తీరుపై విమర్శలు తలెత్తగా ఇక ఆమె ఎంత నెగటివ్ అయిందో అంతే ప్లస్ కూడా అయింది అని చెప్పవచ్చు.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన విషయాలలోకి వెళ్తే బాలాదిత్యా ఎదురుగా కాళ్లు చాపుకొని కూర్చున్న గీతూ రాయల్.. కాలు మీద కాలు వేసి అతని ముఖం దగ్గర కంటే ముందుకు పెట్టి కాళ్ళు ఊపుతూ ఉంది. ఇక అప్పుడు బాలాదిత్య ఆ కాళ్లు ముఖం మీద పెట్టి ఊపడం బాలేదు .. కాస్త సవ్యంగా కూర్చో అని చాలా పద్ధతిగా, మర్యాదగా చెప్పాడు. ఇక ఆమె మాత్రం.. ఏ నీ మూతిలో పెట్టి ఊపినానా అని చిరాకుగా ముఖం పెట్టి వెటకారంగా మాట్లాడింది.
బాలాదిత్య ఎవరి మూతిలో పెట్టి ఊపినా తప్పే కదమ్మా అని అనడంతో.. ఇది నా అలవాటు అంటూ మళ్ళీ కాలు బాలాదిత్య వైపు పెట్టి బలుపు చూపించింది.. అప్పుడు బాలాదిత్య.. ఇప్పుడే చెప్పాను కదా గీతు అలా కాళ్లు ఊపోద్దని అంటూ నవ్వుతూ చాలా ఓపికగా చెప్పాడు.. కానీ గీతూ మాత్రం నాకు కదలడం అలవాటు.. సరిగా ఉండలేను అని అనడంతో.. నార్మల్ గా కూర్చో లిమిట్స్ దాటకూడదు కదా చూసే వాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటుంది. ముఖంపై కాలు పెట్టడం పద్ధతి కాదు అని చురకలేశాడు బాలాదిత్య. ఆ తర్వాత జరిగిన కెప్టెన్సీ టాస్కులు బాలాదిత్య కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే ఈ ప్రాసెస్‌లో కెప్టెన్సీ పోటీలో గీతూ కూడా పోటీ పడింది అప్పుడు కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఇక నంబర్ ప్లేట్స్ తన టీషర్టు లోపల పెట్టేసుకుంది. వేరే వాళ్ళ నంబర్స్ ని టీషర్ట్ లోపలికి పెట్టేసుకొని ఇది నా స్ట్రాటజీ అని చెప్పింది.. ఇక నంబర్స్ వేయకూడదని రూలు లేదు కదా అని అడిగింది.. నువ్వు తీసుకొని టీ షర్ట్ లోపల వేసుకున్నావు కదా వాటిని ఎలా తీయాలి అని రోహిత్ అడగడంతో.. అదీ నా స్ట్రాటజీ కావాలంటే తీసుకో అంటూ దిగజారి మాట్లాడింది. ప్రతి ఒక్కరు ఈమెను విసుక్కున్నారు.. ఇక మెరీనా మాట్లాడుతూ.. ఏమైనా చేస్తా అంటున్నావు కదా బోర్డ్స్ టీషర్టు లోపల నంబర్స్ వేసుకున్నావు.. అబ్బాయిలు చేయి పెట్టి తీస్తే ఏం చేస్తావంటూ అని ప్రశ్నించగా.. తీసుకోనివ్వు నాకేమనిపించదు అని అనేసింది గీతూ..ఇక దండం మహాతల్లి అని అందరూ బిత్తరపోయారు.