బిగ్ బాస్: కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన శ్రీ సత్య..!!

-

బిగ్ బాస్ సీజన్ 6 లోకి సీరియల్ ఆర్టిస్టుగా వచ్చిన శ్రీ సత్య మొదటి రెండు వారాలు నెమ్మదిగా ఉంది. ఇక మూడో వారం పోలీస్ – దొంగల టాస్క్ లో ఫస్ట్ టైం కెప్టెన్సీ పోటీదారు అయింది. ఇక అంతే కాదు రెండో లెవెల్ లో శ్రీహాన్ ఇంకా ఆది రెడ్డిలతో సమానంగా పోరాడింది.. హోస్ట్ నాగార్జున శనివారం రోజు శ్రీ సత్యను పొగడ్తలతో ముంచెత్తారు.. అంతకు ముందు రోజే శ్రీ సత్య.. అర్జున్ తో సెన్సేషనల్ కామెంట్లు చేసింది. అవేమిటంటే నేను ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది.. కానీ వెళ్లిపోయేటప్పుడు మాత్రం నేనంటే ఏంటో చూపించి వెళ్లాలని ఉంది అని చెప్పింది. బిగ్ బాస్ హౌస్ కి కేవలం డబ్బు కోసం మాత్రమే వచ్చానని, కొద్దో గొప్పో పేరు వచ్చినా చాలని , అమ్మానాన్నలు చూసుకోవడమే నాకున్న టాస్క్ అంటూ తెలిపింది.

అదే సమయంలో అర్జున్ టచ్ చేసి మాట్లాడుతుంటే కోపంలో ఉన్నప్పుడు టచ్ చేయకు చిరాగ్గా అనిపిస్తుంది అంటూ అర్జున్ పై సీరియస్ అయింది.. నిజానికి శ్రీ సత్య చుట్టు అర్జున్ తిరుగుతున్నాడు. ఇక టాస్క్ లో గోల్డెన్ కొబ్బరిబోండం కూడా శ్రీ సత్య అడిగిందని అర్జున్ ఆమెకు ఇచ్చేశాడు. ఇక శ్రీహాన్ కూడా అర్జున్ కి శ్రీ సత్య మీద ఫీలింగ్స్ ఉన్నాయని ఓపెన్ గానే చెప్పేసాడు. కానీ శ్రీ సత్య మాత్రం అన్న అంటూ మాట్లాడింది. ఇక అందుకే ఆ చనువుతోనే జైల్లో ఉన్న అర్జున్ తో ఈ విషయాలు పంచుకుంది. ఆ తర్వాత కూడా రేవంత్ తో ఇప్పుడు డోర్స్ తీసి వెళ్లిపోమన్నా వెళ్లిపోవాలని ఉందని, అందుకే ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాను అంటూ తెలిపింది.

ఇక ప్రస్తుతం ఈ వారం నామినేషన్ లో శ్రీ సత్య లేదు.. వచ్చేవారం కూడా నామినేషన్ లోకి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక నాగార్జున వీకెండ్ ఇచ్చిన బూస్టర్ తో నెక్స్ట్ టాస్క్ లో ఎలా పెర్ఫార్మన్స్ చేయబోతుందని ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version