రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు రోజుల అబుదాబి విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. నేటి ఉదయం (సోమవారం) SLBC టన్నెల్ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు.
ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, పలువురు అధికారులు సైతం ఉండనున్నారు. ఎల్‌ఎల్‌బీసీ ప్రమాదంలో 42 మంది సురక్షితంగా బయటపడగా..ఎనిమిది మంది కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో భారీ ఎత్తున బురద, నీరు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలిగినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్‌డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు సైతం రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి.
3 రోజుల అబూదాబి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రేపు ఉదయం SLBC టన్నెల్ ఘటనా స్థలానికి వెళ్లనున్న కోమటిరెడ్డి pic.twitter.com/fPPCJgchXH
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2025