ఓటీటీలోకి వచ్చేసిన ‘బింబిసార’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

-

ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి పోసింది బింబిసార సినిమా. ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీతో కల్యాణ్ మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. మల్లిడి విశిష్ట దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏడేళ్లుగా హిట్ కోసం పరితపిస్తున్న కల్యాణ్ రామ్ కు సూపర్ హిట్ ను అందించింది. వసూళ్లలోనూ భేష్ అనిపించిన ఈ మూవీ కోసం థియేటర్ లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఇక ‘బింబిసార’ ఫ్యాన్ వెయిటింగ్ ముగిసినట్లే. గత రాత్రి బింబిసారుడు ఓటీటీలోకి వచ్చేశాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ-5’లో గత అర్ధరాత్రి నుంచి ‘బింబిసార’ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ల్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సంయుక్తా మీనన్‌, కేథరిన్‌ థెరిసా హీరోయిన్లుగా నటించారు. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి బాణీలు సమకూర్చాడు.

ఈ చిత్రానికి దాదాపు రూ.15 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఫుల్‌ రన్‌లో రూ.40 కోట్ల వరకు షేర్‌ను సాధించి డబుల్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో క‌ల్యాణ్‌రామ్ మార్కెట్ అమాంతం పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version