“బ్రహ్మాస్త్రం” ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు !

-

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌలి ప్రజెంట్ చేయడంతో పాటు విడుదల చేస్తు్న్నారు. ‘బ్రహ్మాస్త్రం’ టైటిల్ తో విడుదల కానున్న ఈ పిక్చర్ లో బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, మౌనీ రాయ్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు పార్ట్ లుగా విడుదల కానుంది.

తొలి భాగం..‘బ్రహ్మాస్త్రం: శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలో సర్ ప్రైజెస్ కూడా ఉన్నాయని మేకర్స్ చెప్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. వారి పాత్రలు సినిమా స్టోరిలో భాగంగా ఉండటంతో పాటు సినీ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తాయని టాక్. అయితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని ఈరోజు ( సెప్టెంబర్ 2) వ తేదీన హైదరాబాదులో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు కూడా తెలిపారు. అయితే అనుహ్య పరిణామాల నేపథ్యంలో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పర్మిషన్ లేని కారణంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద ఖాళీ చైర్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న కొంతమంది అభిమానులు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిందని తెలియడంతో నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version