పవన్ ‘BRO’ మూవీ థీమ్ సాంగ్ రిలీజ్.. తమన్ మళ్లీ దుమ్ములేపాడుగా..?

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సాయిధరమ్ తేజ్​ మల్టీస్టారర్​లో వస్తున్న సినిమా బ్రో. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అయితే రిలీజ్​కు ముందు జనాల్లో ఆసక్తి కలిగించేలా మూవీ మేకర్స్ తరచూ ఓ అప్డేట్ వదులుతున్నారు. తాజాగా ఈ టీమ్ బ్రో థీమ్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది.

పవన్ పాత్రను ఎలివేట్​ చేస్తూ ఈ థీమ్ సాంగ్ తెరకెక్కించినట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. ‘కాల త్రిగుణ సంశ్లేషం.. కాల గమణ సంకాశం’ అంటూ సంస్కృత పదాలతో ఉన్న ఈ లిరిక్స్​కు తమన్ సమకూర్చిన బాణీలు, బీట్ అదిరిపోయింది. తమన్ కెరీర్​లో మరో గూస్​ బంప్స్​ తెప్పించే పాట వచ్చేసింది. ఈ పాట ఆద్యంతం ఎంతో వినసొంపుగా ఉంది. హై ఫీల్‌ను అందిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

తాజాగా రిలీజ్​ చేసిన థీమ్ లిరికల్ వీడియో సాంగ్​ అదిరిపోయింది. ఆ పాటనే సినిమాకు బాగా​ హైప్​ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు. ఇక ఈ పాటను అదితి, ఆదిత్య, దామిని భట్ల, అనుదీప్, అరుణ్ కౌండిన్య, హారికా నారాయణ ఇలా దాదాపు డజనుకు పైగా గాయకులు పాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version