టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అంటూ రచ్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి(తన స్నేహితుడు)కి మద్దతు ఇవ్వడంతో మెగా అభిమానులు భగ్గుమన్నారు. పవన్, జనసేన గెలుపుకోసం మెగాఫ్యాన్స్ కృషి చేస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎదిగిన బన్నీ ప్రత్యర్థికి వైసీసీకి మద్దతు ఇవ్వడం ఏంటని ఫైర్ అయ్యారు. నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక కూడా బన్నీ కామ్‌గా ఉండటంతో ఇరు కుటుంబాల నడుమ కోల్డ్ వార్ నడుస్తున్న అన్న చర్చ కూడా జరిగింది.
బన్నీ తన కంటూ సొంతంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని కూడా కథనాలు వచ్చాయి. అయితే, ఈ రూమర్లు అన్నింటికీ చెక్ పెడుతూ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ ఎక్స్ వేదికగా అల్లుఅర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మెనీ హ్యపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు’ అంటూ బన్నీ ట్వీట్ చేశారు. ఎట్టకేలకు బన్నీ మౌనం వీడటంతో మెగా ఫ్యాన్స్ ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. మళ్లీ మెగా కుటుంబం ఒక్కటైందని నెట్టింట చర్చ జరుగుతోంది.