సినిమా వాళ్ల పొట్టమీద కొట్టి భయపెట్టారని.. నిన్న జరిగింది చూస్తే ఇలా కూడా చేయవచ్చా అని అనిపించిందని సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నేను 40 క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీ మినిష్టర్ ని ఆతరువాత 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశానని.. నిన్ని మొన్న ఫిలిం ఇండస్ట్రీలో సమస్యను తీసుకువచ్చి ఆసమస్యను పరిష్కారం చేస్తామనే నెపంతో ఏ విధంగా ఆడుకుంటారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదని… ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం అన్నారు.
సినిమా వాళ్ల పొట్టమీద కొట్టి భయపెట్టారు.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
-