Tollywood: టాలీవుడ్ ఫేం చిన్మయి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా చిన్మయి మామాయ్య మరణించారు. అంటే… నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా.. రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటంచారు.
మా నాన్న రవీంద్రన్ నరసింహన్ నిన్నగాక మొన్న చనిపోయారంటూ పేర్కొన్నారు రాహుల్ రవీంద్రన్. ఆయన తన జీవితంలో కష్టపడి, నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపారు. మీరు మా జ్ఞాపకాలలో సజీవంగా ఉంటారు..పప్పా లవ్ యు ఎప్పటికీ… మీరు మాతోనే ఉంటారు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రాహుల్ రవీంద్రన్. ఇక అటు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి కూడా ఎమోషనల్ అయింది. అటు రవీంద్రన్ నరసింహన్ మరణించిన నేపథ్యంలో సమంత కూడా రియాక్ట్ అయ్యారు. సంతాపం తెలిపారు.