మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా రిలీజ్ లేనట్టే!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ చేయనున్నట్లు ఆ మధ్య వైజయంతి మూవీస్ అఫీషియల్గా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా రీ రిలీజ్ ఇప్పట్లో ఉంకపోవచ్చని టాక్. ఎందుకంటే చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న. అయితే అంతకంటే వారం ముందు 15వ తేదీన మిస్టర్‌ బచ్చన్‌, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, ఖేల్ ఖేల్ మే వంటి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంద్ర మూవీకి థియేటర్లు దొరకకపోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రం రీ రిలీజ్ చిరు బర్త్ డే రోజు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త చూసి చిరంజీవి అభిమానులు నిరాశ చెందుతున్నారు. తమ బాస్ సినిమా రీ రిలీజ్ లేదని తెగ ఫీల్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version