నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసింది బంగ్లాదేశ్ పౌరుడు అని పోలీసులు ప్రకటించారు. రాజు అనే పేరును ఇండియాకు వచ్చిన తర్వాత మార్చుకున్నాడని పోలీసులు చెప్పారు. నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై ఇంట్లోకి చొరబడి ఆరుసార్లు కత్తితో పొడిచిన కేసులో అరెస్టయిన వ్యక్తి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ జాతీయుడని చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ముంబైలో నివసిస్తున్నాడని పోలీసులు ఈ రోజు తెలిపారు.
ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడం…. బుధవారం అర్థరాత్రి నటుడు సైఫ్… బాంద్రా ఇంటిలో చోరీకి ప్రయత్నించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించినట్లు తెలిపారు. “ఈ నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందినవాడని దర్యాప్తులో తేలింది. అతని వద్ద ఇండియాకు చెందిన వాడని పత్రాలు లేవు. అతను బంగ్లాదేశ్‌కు చెందినవాడని మేము అనుమానిస్తున్నాము, మేము దర్యాప్తు చేస్తున్నాము అతనిపై కేసుకు పాస్‌పోర్ట్ చట్టం చట్టాలను పరిశీలిస్తున్నాం అని సీనియర్ అధికారి తెలిపారు.