అలియా భట్ ఇంట తీవ్ర విషాదం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..!

-

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట విషాధ ఛాయలు అలముకున్నాయి. ఆమె తాతయ్య నరేంద్ర రాజ్దన్ 93 సంవత్సరాల వయసులో గురువారం స్వర్గస్తులయ్యారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం రోజులుగా ఆసుపత్రిలో పోరాడుతూ ఇవాళ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలియా భట్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తాతయ్య నువ్వే నా హీరో.. 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్ ఆడావు.. మొన్నటి వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు.. బోలెడన్ని కథలు కూడా నాకు చెప్పేవాడివి. నాకోసం రుచికరమైన ఆమ్లెట్ కూడా వేసి ఇచ్చేవాడివి. వయోలిన్ వాయించేవాడివి.. నీవు నీ ముని మనవరాలితో కూడా ఆటలాడుకున్నావు..

నువ్వు క్రికెట్ ఆడే విధానం, నీ స్కెచ్ అంటే కూడా మాకు చాలా ఇష్టం. నీ చివరి క్షణం వరకు మీ కుటుంబాన్ని ప్రేమిస్తూనే వచ్చావు. ఇప్పుడు నువ్వు లేవన్న బాధతో నా మనసు మొత్తం దుఃఖంతో నిండిపోయింది.. అయినా బాధపడను.. ఎందుకంటే మా తాతయ్య నాకు బోలెడంత సంతోషాన్ని అందించాడు.. అందుకు చాలా గర్వంగా ఉంది. మనం మళ్లీ కలుసుకునే వరకు దాన్ని అలాగే భద్రంగా ఉంచుకుంటాను అంటూ ఇంస్టాగ్రామ్ లో భావోద్వేగ పూరితమైన పోస్ట్ పెట్టింది. అంతే కాదు ఇటీవల కాలంలో జరిగిన ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోని కూడా జత చేసింది అలియా భట్.

ఇక అలియా భట్ తాతయ్య మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అవుతోంది అలియా భట్. ఇక అలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా రెడ్ కార్పెట్ పై మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version