బాలయ్య చేతుల మీదుగా విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ట్రైలర్ విడుదల..

-

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘ధమ్కి’ మూవీ చేస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. నివేదా పేతురాజు మరోసారి విశ్వక్ తో కలిసి నటించబోతుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్రం బృందం.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో నిన్న ఈవెంట్ పెట్టి మరి బాలయ్య చేతుల మీదుగా దమ్కీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఎన్నడూ లేని విధంగా విశ్వక్సేన్ మనకు తెరమీద కనిపించాడు. ఎన్నో రకాల ఆసక్తికరమైన సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version