శ్రీ లీల కూడా అలాంటి పనులు చేసిందా.. కట్ చేస్తే..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల ప్రస్తుతం తన చేతిలో పది సినిమాలను పెట్టుకొని మరింత బిజీ హీరోయిన్గా మారిపోయింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఇలా వరుసగా భారీ పాపులారిటీ దక్కించుకోవడం నిజంగా సీనియర్ హీరోయిన్లకు కూడా చమటలు పడుతున్నాయని చెప్పవచ్చు. పెద్దపెద్ద హీరోల సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటున్న ఈమె గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీలీల కు సంబంధించిన ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

విషయంలో కెళితే చిన్నప్పటినుంచి శ్రీలీలను తన తల్లి చాలా కండిషన్స్ పెడుతూ పెంచిందట. సాధారణంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎంతో ఇష్టం చూపుతూ ఉంటారు. అలాంటి అవకాశం తనకు తల్లి ఇవ్వలేదని… స్కూల్ అయిపోగానే ట్యూషన్.. ట్యూషన్ అయిపోగానే డాన్స్ క్లాస్.. ఆ తర్వాత యాక్టింగ్ అంటూ తనను ప్రతిక్షణం తీరిక లేకుండా బిజీగా ఉంచడంతో విసిగిపోయానని శ్రీ లీల చెప్పుకొచ్చింది. ఇక ఆ టార్చర్ నుంచి తప్పించుకోవడానికి దొంగ సాకులు చెబుతూ ఒక్కోసారి ఇంటిపట్టునే ఉండేదట. ఇలా స్కూల్, యాక్టింగ్ , డాన్స్ క్లాసెస్ కు వెళ్లాలి అంటే బోర్ కొట్టినప్పుడు కడుపునొప్పి అని అబద్ధం చెప్పేదట ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇలా తనకు బోర్ కొట్టిన ప్రతిసారి ఆరోగ్యం బాగోలేదని చెప్పి తల్లిని మోసం చేసి ఇంటిపట్టునే ఉంటూ ఆ రోజంతా తనకు ఇష్టం వచ్చిన విధంగా గడిపేదట. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నప్పుడు ఇంత అల్లరిగా ఉన్న ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారిపోయిందా అన్నట్లుగా నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే తన తల్లి నాడు పెట్టిన కండిషన్ లే నేడు శ్రీ లీల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version