BREAKING : మళ్లీ తండ్రయిన నిర్మాత దిల్‌రాజు..

-

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. చాలా చిన్న వయసులోనే నిర్మాతగా మారిన ఈయన ఇప్పటికే 25 సినిమాలు మైలురాయిని కూడా అందుకున్నాడు. అయితే.. ఈ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు.

ఆయన భార్య తేజస్విని మగ బిడ్డకు తాజాగా జన్మించింది. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడు వచ్చాడంటూ టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో దిల్ రాజు, తేజస్విని వివాహం జరిగింది.

దిల్ రాజు.. తేజస్విని రెండో వివాహం చేసుకున్నాడు. ఆయన మొదటి భార్య అనిత 2017 సంవత్సరం లో మరణించింది. దిల్ రాజు, అని తలకు కూతురు హర్షిత రెడ్డి ఉండగా.. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాత అయిన దిల్ రాజు ఇప్పుడు తండ్రి కావడం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version