అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్

-

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. రేవతి, శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలం అయ్యారని ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు ఆయన ఇంటి ఆవరణలో పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడి పై వెంటనే స్పందించిన పోలీసులు ఆరుగురు జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

దాడి చేసిన వారినీ రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ గా పోలీసులు గుర్తించారు. నిందితులపై బీఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ నిందుతులను జడ్జీ ముందు హాజరు పరిచారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన ఆరుగురికి జడ్జీ బెయిల్ మంజూరు చేశారు. రూ.10వేలు డిపాజిట్ తో పాటు రెండు షూరిటీలను సమర్పించాలని  ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version