అనిల్ రావిపూడి దర్శకత్వం లో..బాలయ్య- రవితేజ మల్టీస్టారర్..

-

అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఇది ఓ మల్టీస్టారర్.. మాస్ మహారాజ రవితేజ కూడా ఇందులో మరో హీరోగా కనిపించబోతున్నాడు.అనిల్ రావిపూడి బాలకృష్ణ కి కథ చెప్పినప్పుడే ఇందులో మరో హీరో కి కూడా అవకాశం ఉందనిభావించారు. ఇప్పుడు ఆ హీరో రవితేజ గా ఫిక్స్ చేశారు.

ఈ విషయంలో దర్శకుడు అనిల్, రవితేజ ని సంప్రదించడం ఆయన ఓకే అనడం జరిగిపోయింది. బాలయ్య కూడా రవితేజ అంటే పచ్చజెండా ఊపేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి- రవితేజ లది హిట్ కాంబినేషన్.బాలయ్య -రవితేజని ఒక్కటిగా చూడటం కూడా క్రేజీీ కాంబినేషన్.ఇటీవల (unstoppable) షోలో బాలయ్య, రవితేజ కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే.గతంలో రవితేజ, బాలయ్య మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయని టాక్ ఉండేది. ఈ షోలో అవన్నీ రూమర్స్ అన్నింటిని కొట్టిపారేశారు.త్వరలోనే ఈ మల్టీ స్టారర్ ని ఖరారు చేస్తూ ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version