రీ ఎంట్రీ కోసం విజయశాంతి తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?

-

ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి , బాలకృష్ణ లాంటి హీరోలకు తన సినిమాలతో చెమటలు పట్టించిన ఈమె.. ఆ హీరోల సరసన హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు ఒకానొక సమయంలో హీరోలతో సమానంగా పారితోషకం కూడా అందుకుంది. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె రాజకీయాలలో పెద్దగా సక్సెస్ పొందలేదు. దాదాపు 17 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విజయశాంతి రాజకీయాలలో బిజీ అయ్యారు. అయితే ఇటీవల మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు విజయశాంతి.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈమెకు మరింత గుర్తింపును అందించింది. ఇందులో దేశం కోసం తన కన్న బిడ్డలను త్యాగం చేసే తల్లి పాత్రలో విజయశాంతి నటించారు. అయితే తన కమ్ బ్యాక్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం విజయశాంతి ఎంత పారితోషకం తీసుకుంది అనే విషయం వైరల్ గా మారుతుంది. అసలే స్టార్ హీరోయిన్.. పైగా ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ కావడం.. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు తర్వాత అంత డిమాండ్ ఉన్న హీరోయిన్ ఈమె కావడంతో నిర్మాతలు ఈమెకు భారీ రేంజ్ లో పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.

ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించిన విషయం తెలిసిందే . మరి విజయశాంతి క్రేజ్ ఎక్కువగా ఉన్న కారణంగా ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా కోటి రూపాయలు ఇచ్చారని సమాచారం. దీన్నిబట్టి చూస్తే విజయశాంతి రేంజ్ ఎక్కడా తగ్గలేదని స్పష్టం అవుతోంది. అయితే ఈ సినిమా తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాలలో కనిపించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version