అరుంధతి సినిమాకు సోనుసూద్ పారితోషికం ఎంతో తెలుసా..?

-

అరుంధతి.. అనుష్క సినీ కెరియర్ లోనే ఇది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పవచ్చు. ముందుగా ఈ పాత్ర కోసం ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించినా ఆ అదృష్టం మాత్రం అనుష్కకే దక్కింది .. అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క తర్వాత వరుసగా స్టార్ హీరోలు సినిమాలలో అవకాశాన్ని సొంతం చేసుకుంది. కేవలం హీరో ఓరియంటెడ్ సినిమాలో మాత్రమే కాదు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా తనదైన మార్కు వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ క్రమంలోనే అరుంధతి పాత్ర ఒక ఎత్తు అయితే ఆ పాత్రకు అంతే దీటుగా పశుపతి పాత్ర అమోఘమని చెప్పాలి.

ఈ పాత్రలో నటించిన సోనుసూద్ పాత్రకు ప్రాణం పోశాడు.. ఈ సినిమాలో డైలాగ్స్ చెప్పడం ఒకే ఎత్తు అయితే డైలాగ్స్ కి తగ్గట్టుగా ముఖ కవళికలు ఇస్తూ ప్రేక్షకులలో భయాన్ని పుట్టించాడు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ చిత్రంలో సోనా సూధ్ కి బదులుగా తమిళ్ నటుడు పశుపతిని అనుకున్నారు. ఇక ఆ పాత్రకు ఆ పేరు పెట్టడానికి కూడా కారణం అదే. ముఖ్యంగా అఘోర పాత్రకు పశుపతి చాలా చక్కగా సూట్ అవుతాడు కానీ సినిమాలో రాజుగా కనిపించే సీన్లు కూడా కొన్ని ఉన్నాయి . అందుకే నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఆలోచనలో ఉండగా.. అప్పుడే ఎన్టీఆర్ నటించిన అశోక్ చిత్రం విడుదలడం అందులో నటించిన సోనుసూద్ శ్యాం ప్రసాద్ రెడ్డి దృష్టిని ఆకర్షించడం జరిగింది.ఇక తర్వాత అఘోరా గెటప్ స్కెచ్ చూపించగానే ఆ పాత్ర తను చేయనని సోనూ సూద్ చెప్పేశారు. అయితే ఒకసారి గెటప్ వేస్కో మేకప్ టెస్ట్ చేసిన తర్వాత నచ్చకపోతే ఇంకో నటుడిని తీసుకుంటానని అతని కన్విన్స్ చేశారు శ్యాం ప్రసాద్ రెడ్డి. ఇక దశావతారం చిత్రంలో కమలహాసన్ కి పనిచేసిన రూపశిల్పి రమేష్ ను చెన్నై నుంచి పిలిపించి ఆయనతో వేయించారు. మేకప్ వేయడానికి ఆరు గంటల సమయం పట్టింది. ఇష్టం లేకపోయినా శ్యాంప్రసాద్ రెడ్డి తపన చూసి చివరికి ఒప్పుకున్నారు. 20 రోజుల్లోనే పూర్తి చేస్తానని శ్యాం ప్రసాద్ రెడ్డి చెప్పడంతో రూ.18 లక్షలు ఇవ్వమని సోనుసూద్ డిమాండ్ చేశారట. అంతేకాదు 20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా చేస్తానని కూడా ఆఫర్ ఇచ్చాడట. కానీ సాంప్రసాద్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. 18 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేస్తానని ఒకవేళ కాకపోతే 21వ రోజు నుంచి రోజుకి 25 వేల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పాడట. కానీ 20 రోజుల్లో వర్క్ పూర్తి కాకపోవడంతో మొత్తం అరుంధతి చిత్రం వరకు ఆయన పని చేయాల్సి వచ్చింది. ఇక మొత్తానికి అయితే ఈ సినిమా కోసం 45 లక్షల రూపాయలు ఇచ్చారు. శ్యాం ప్రసాద్ రెడ్డి. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరో స్థాయిని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version