అయ్యప్ప భక్తులకు అలర్ట్. నేడు సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇస్తుంది.
మకరజ్యోతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా టీవీలో వీక్షించేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.