తెలుగు హీరోల సరికొత్త పారితోషకం ఎంతో తెలుసా..?

-

టాలీవుడ్ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా గా మారిపోయిన నేపథ్యంలో చిన్న హీరోలను మొదలుకొని పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా హీరో అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పారితోషకం విషయంలో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక హీరోలే కాదు సినిమాలు కూడా కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కుతూ అంతకుమించి కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డు సృష్టిస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు తాజాగా మన తెలుగు హీరోలు అందుకుంటున్న పారితోషకాల గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్:

ఒక్క సినిమాకు రూ .100 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న ప్రభాస్ తాజాగా తన 25వ సినిమా స్పిరిట్ కోసం రూ.150 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సలార్ వంటి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

పవన్ కళ్యాణ్:

ప్రస్తుతం రీ యంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకి పైగా పారితోషకం తీసుకుంటున్న ఈయన హరిహర వీరమల్లు సినిమా కోసం రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు బోగట్టా..

మహేష్ బాబు:

సర్కారి వారి పాట సినిమా కోసం రూ.55 కోట్లు తీసుకున్న మహేష్ బాబు.. ఇప్పుడు రాజమౌళి సినిమాతో రూ.80 కోట్ల పారితోషకం తీసుకునే స్టేజికి ఎదిగిపోయారు.

జూనియర్ ఎన్టీఆర్:

ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం రూ.45 కోట్ల పారితోషకం తీసుకున్న ఈయన ఇప్పుడు తాను నటిస్తున్న దేవరా సినిమా కోసం రూ.60 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.

రామ్ చరణ్:

ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం రూ.45 కోట్ల పారితోషకం అందుకున్న రాంచరణ్.. శంకర్ సినిమా కోసం రూ.60 కోట్ల పారితోషకం అందుకుంటున్నారు.

చిరంజీవి:

ఒక్క సినిమాకు రూ.50 కోట్ల పారితోషకం తీసుకునే ఈయన భోళా శంకర్ లో ప్రస్తుతం నటిస్తున్నందుకుగాను రూ .50 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version