ఆ దర్శకుడి రెమ్యునరేషన్ అన్ని కోట్లు..అని మీకు తెలుసా?

-

జనరల్‌గా సినిమా దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ప్రతీ ఒక్కరు గౌరవిస్తుంటారు. అయితే, ఒకప్పుడు సినిమాలన్నీ కూడా హీరో సెంట్రిక్ గానే ఉండేవి. కానీ, ఇప్పుడు కాలం మారింది. టాలెంటెడ్ దర్శకులు వచ్చిన నేపథ్యంలో దర్శకుడికే ప్రయారిటీ ఉంది. అయితే, ఇప్పటికీ దర్శకులకు రెమ్యునరేషన్ హీరోలతో పోల్చితే అంతంత మాత్రంగానే ఉంటాయని టాక్.

అగ్ర దర్శకులకు రెమ్యునరేషన్ ఇటీవల కాలంలో బాగా పెరిగినట్లు వార్తలొస్తు్న్నాయి. కాగా, ఈ దర్శకుడికి మాత్రం దిమ్మదిరిగిపోయే రెమ్యునరేషన్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. బీ టౌన్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం.. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ..బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

sanjay leela bhansali

సంజయ్ తెరకెక్కించిన ‘గంగుబాయి కతియా వాడి’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. కాగా, ప్రస్తుతం ఆయన ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ గా వస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ‘నెట్‌ఫ్లిక్స్’ భారీ స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించిందట. దాదాపుగా రూ. 200కోట్ల ఖర్చుతో సిరీస్ తెరకెక్కనుంది. ఇందులో రూ. 60కోట్ల నుంచి రూ.65కోట్ల వరకు భన్సాలీకీ రెమ్యునరేషన్‌గా చెల్లించనున్నారని వినికిడి.

ఇండియాకు స్వాతంత్ర్యం రాక మునుపు దేశంలో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారని తెలుస్తోంది. బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, హ్యుమా ఖురేషీ , రిచా చద్దా ఇందులో కీలక పాత్రలు పోషిస్తు్న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version