దీపిక పదుకొనే మెడపై ఉన్న టాటూ సీక్రెట్ ఏంటో తెలుసా..?

-

ఆస్కార్ వేడుకల్లో ప్రతినిధిగా మెరిసిన దీపికా పదుకొనే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి అద్భుతంగా స్పీచ్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. దీంతో అందరిచూపు ఆమెపైనే పడింది.ఆమెకు సంబంధించిన ప్రతి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే దీపిక మెడపై ఉన్న టాటూ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకి ఉన్న క్రేజ్ పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవల లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలలో బ్లాక్ డ్రెస్ లో బుట్ట బొమ్మలా మెరిసిన ఈమె వెల్వెట్ బ్లాక్ గౌన్, డైమండ్ నెక్లెస్ ధరించి అందర్నీ ఆకట్టుకుంది.

ఇకపోతే డైమండ్ నెక్లెస్ తీక్షనగా చూసినప్పుడు ఆమె మెడ పై ఉన్న టాటూ అందరినీ ఆకట్టుకుంది. ఆమె చెవికి దిగువన తన మెడపై 82°E అని టాటూ ఉంది మరి దీని అర్థం ఏంటి అని నెటిజెన్లు ఆరా తీయగా అది ఆమె స్కిన్ కేర్ బ్రాండ్ పేరు అట. ఇటీవల ఆమె జిగర్ షా అనే స్కిన్ కేర్ బ్రాండ్ స్థాపించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ నుంచి ఈ బ్రాండ్ చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. అలా తన సొంత బ్రాండ్ ను దీపిక మెడపై టాటుగా వేసుకోవడం చూసి అభిమానుల ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే ఆస్కార్ వేడుకలలో భారత్ నుంచి దీపిక స్పెషల్ అట్రాక్షన్ అయింది. దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు నేటిజెన్లు. దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇంత ప్రతిష్టాత్మకమైన వేదికపై నిలవడం అంత సులభం కాదంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తింది బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version